అన్నీ రికార్డు చేస్తున్నాం .. జాగ్రత్త , తెలంగాణ పోలీసులకు కేసీఆర్ వార్నింగ్

 


తెలంగాణ పోలీసులకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వార్నింగ్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ.. సభకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని, బొమ్మలు పీకేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ మిత్రులు వారి డ్యూటీ వారి చేసుకోవాలని .. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, మీ గతి ఏమవుతుందో ఆలోచించాలని కేసీఆర్ హెచ్చరించారు. 

Also Read : మన సరబ్‌జిత్ సింగ్‌ను చంపిన పాకిస్తాన్ డాన్ హతం

అన్నీ రికార్డు చేస్తున్నామని.. ప్రజల స్పందన చూసైనా మారాలని కేసీఆర్ సూచించారు. లేనిపక్షంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారని.. పెద్దపల్లి జిల్లా ధర్మారంకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాధవరావు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవరావుపై ఏం జరిగిందనే దానిపై విచారణ జరిపించాలని .. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తాను కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిగా , ఎమ్మెల్యేగా వున్నానని.. సీఎం హోదాలో వున్నప్పటికీ దౌర్జన్యాలు చేయించలేదని ఆయన పేర్కొన్నారు. పోలీసులు రాజకీయాల్లోకి తలదూర్చవద్దని కేసీఆర్ హితవు పలికారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా రావని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పనైపోయిందని, ఆ పార్టీపై ప్రజాగ్రహం ప్రారంభమైందని, నారాయణపేట సభలో సీఎం వణుకుతున్నాడని చంద్రశేఖర్ రావు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వుంటాడా వేరే పార్టీలకు జంప్ అవుతాడా అనేది తెలియదని, ఆయన ఇక్కడేమో కాంగ్రెస్‌కు ఓటేయమంటాడు, ఢిల్లీకి వెళ్లి బీజేపీకి ఓటేయాలని చెబుతాడని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కొంతమంది లిల్లిపుట్ గాళ్లకు అప్పుడప్పుడు అధికారం వస్తుందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Also Read : 'ప్రతీకారం' తప్పదు .. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగిన ఇరాన్ సుప్రీం లీడర్ , ఎవరీ అయతుల్లా అలీ ఖమేనీ ..?

కాంగ్రెస్ మెడలు వంచైనా సరే రూ.2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్‌కు బలమిస్తే రైతుల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన వెల్లడించారు. తాను కడుపులో పెట్టుకుని కాపాడిన రైతులు ఇవాళ ఆగమాగం అవుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వాగ్థానాలు చేసి మీ ఓట్తతో అధికారంలోకి వచ్చి అన్నింటినీ ఎగ్గొట్టారని  ఆయన మండిపడ్డారు. 



Comments